19 May, 2026 | 6:12 AM

తప్పుడు పోస్టులు పెడితే చర్యలు

19-05-2026 12:00 AM

నిర్మల్, మే 18 (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లాలో గో వద నిషేధ చట్టాన్ని పోలీస్ శాఖ ఖచ్చితంగా అమలు చేస్తుందని దీనిపై కొందరు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారని వారిపై చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు. నిర్మల్ జిల్లాలో బక్రీద్ పండుగ నేపథ్యంలో గోవుల అక్రమ రవాణా జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. గోవులను అక్రమంగా రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. గోవుల అక్రమ రవాణా గోవధ అనే అంశాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు పోస్టులు ఉండవద్దని సూచించారు.