రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టండి
గుండాల,(విజయక్రాంతి): కార్పొరేషన్ పరిధిలో నే కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా రేషన్ బియ్యం బ్లాక్ దందాను అరికట్టాలని సేవ్ కొత్తగూడెం సేవ్ కార్పొరేషన్ కన్వీనర్, ఆవాజ్ పట్టణ కార్యదర్శి జలాల్ అన్నారు. జిసిసి లలో నిరుపేదలకు ఇస్తున్న బియ్యాన్ని కొనుగోలు చేసే బ్లాక్ మార్కెట్ కి తరలించి తిరిగి పేదలకు అధిక ధరలకు అమ్మే ప్రక్రియకు అడ్డుకట్ట వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రేషన్ షాపులో దారులు సైతం ఈ బ్లాక్ దందాకు పలువురు పాల్పడుతున్నారని అధికారులు వారిపై నిగా పెట్టి వారి లైసెన్సులను రద్దు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రేషన్ బియ్యం తరలిస్తూ పరీక్షా ప్రాంతాల్లో ఉన్న మిల్లర్లకు ఇచ్చి వాటిని సన్నబియంగా మార్చే ప్రక్రియ కొనసాగుతుందని ఇది మూడు పూలు ఆరుకాయల్లాగా నిత్యం కొనసాగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ప్రత్యేక దృష్టి సారించి రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్ కు వెళ్లకుండా అలా పాల్పడే వారికి సహకరించే వారికి అధికారులు తగిన బుద్ధి చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పేదలు సైతం రేషన్ షాప్ బియ్యం అమ్మకానికి పెట్టవద్దని అలా చేయడం వల్ల తిరిగి వాటిని సన్నబియంగా మార్చి మీకే అధిక ధరలకు బియ్యం దందా దారులు అమ్ముతున్నారని ప్రజలు వీటిపై అవగాహనతో చైతన్యంతో ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు




