24 April, 2026 | 4:21 AM

ఇండియా ఫారెస్ట్ సర్వీస్‌కు మెదక్ డీవైసీఎఫ్ జోజీ ఎంపిక

24-04-2026 01:10 AM

మెదక్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): 2019 బ్యాచ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కు మెదక్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జోజి ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మెదక్ జిల్లాలో డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (ౄYCF)డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్  పనిచేస్తున్న జోజి 2019 బ్యాచ్కు చెందిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కు ఎంపిక కాబడిన సందర్భంలో జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా పూల మొక్క అందించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. జోజి అటవీ శాఖలో అలుపెరగని ఆణిముత్యంగా పనిచేస్తూ జిల్లాలో అటవీ శాఖను క్రమశిక్షణగా నడిపిస్తూ ఉత్తమ  పనితీరు కనబరుస్తూ ప్రశంసలు అనుకుంటున్నారని కొనియాడారు. 2019 బ్యాచ్ కు చెందిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కు ఎంపిక కావడం అభినందనీయమన్నారు.

ఈ సందర్భంలో డిఎఫ్‌ఓ జోజి మాట్లాడుతూ ఉద్యోగ విధి నిర్వహణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 1993లో ఎఫ్‌ఆర్‌ఓ గా జాయిన్ అయి 2008 సంవత్సరంలో అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గా పదోన్నతి పొంది తదుపరి 2017 సంవత్సరంలో డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గా పదోన్నతి పొంది నాగర్ కర్నూల్ జిల్లాలో పనిచేస్తున్నట్టు వివరించారు. అటవీ శాఖలో అంచలంచెలుగా ఉన్నత పదవులు అధిరోహిస్తూ 2019 బ్యాచ్ కు చెందిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కు ఎంపికైన సందర్భంలోఉన్నతాధికారులందరికీ ధన్యవాదాలు తెలిపారు.