19 August, 2026 | 5:20 PM

గుడిసెలు లేని గూడేలను చేద్దాం: మాజీ ఎంపీ

19-08-2026 04:19 PM

బోథ్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో గుడిసెలు లేని గూడేలను గ్రామాలను చూడాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారని ఆయన ఆశించిన లక్ష్యం నెరవేర్చేందుకు తన వంతు కృషి చేస్తానని మాజీ ఎంపీ సోయం బాపూరావు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని నాగపూర్, మంద పొగుడ, అందూర్ గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగపూర్ సిసి రోడ్ల నిర్మాణంతో పాటు రేషన్ షాప్ ఏర్పాటు కోసం కృషి చేస్తామన్నారు. మంద బొగుడ గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణంతో పాటు తీసి రోడ్ల నిర్మాణం కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇస్తామన్నారు.

అందూర్ గ్రామంలో 25 ఇందిరమ్మ ఇండ్లు మంజూరి కి కృషి చేస్తామన్నారు. గ్రామంలోకి వరద నీరు రాకుండా ప్రహరీ గోడ నిర్మించే విధంగా ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. ఇండ్ల మంజూరు కి ఇంచార్జ్ మంత్రి తో మాట్లాడి చర్య తీసుకుంటామన్నారు. మంజూరు ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమని అయితే కొందరు తాము ఏదో చేసి ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇంద్రవెల్లిలో జరిగిన సభ విజయవంతం కావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికికి ఆదివాసి గ్రామాల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేయాలి అన్న ఆతృత పెరిగింది అన్నారు.

సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణలు మాట్లాడుతూ మాజీ ఎంపీ  సోయం బాపూరావు కు ముఖ్యమంత్రితో ఉన్న అనుబంధం వల్ల అభివృద్ధికి ఆస్కారం ఉందని అయితే కనీస వసతులు లేని గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్న అభివృద్ధి కోసం పాటుపడుతుందన్నారు.

కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతిని ధి పి చంటి, కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ భోజన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి మాజీ ఎంపీటీసీ చట్ల ఉమేష్ సోనాల మండల కన్వీన ర్ గాజుల పోతన్న, అందరు సర్పంచ్ పృథ్వీరాజ్ నక్కలవాడ సర్పంచ్ కడప నవీన్ కుచ్చిలాపూర్ సర్పంచ్ మైలి నారాయణ నాగపూర్ సర్పంచ్ దేవరావు ఇచ్చోడ సర్పంచ్ జులై జాకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బి మల్లేష్,అబూద్, మహమ్మద్ ,అబ్రార్ ఆదివాసీ నాయకులు మడవి జలపతి దేవదాస్ చౌహన్ పెందుర్గంగాధర్ అచ్యుతానంద రెడ్డి శ్రీకాంత్ రెడ్డి కుంట ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.