10 April, 2026 | 6:00 PM

రహదారి ప్రమాదాలు నివారణకు చర్యలు

10-04-2026 04:18 PM

జిల్లా కలెక్టర్ కె.హరిత 

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో రహదారి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరిత అన్నారు. శుక్రవారం సమీకృత  కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రెవెన్యూ, పోలీస్, రవాణా, రహదారి భవనాల, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, జాతీయ రహదారులు, విద్యా, వైద్య, ఆరోగ్యశాఖ, అధికారులతో నిర్వహించిన జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశానికి ఎస్పి నీతికాపంత్,అదనప కలెక్టర్ ఏం. డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్ల , ఆర్డీవో లోకేశ్వర్ రావు తో కలిసి కలెక్టర్ హరిత  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రహదారులు ప్రమాదాలు జరగకుండా అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారికి ఇరువైపులా వున్నా గ్రామాలలో నేషనల్ హైవే అధికారులు, లైటింగ్ ఏర్పాట్లు, సర్వీస్ రహదారిపై స్పీడ్ బ్రేకర్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. పెట్రోలింగ్ వాహనాలు అందుబాటులో ఉంచాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులు రహదారులకు అడ్డంగా ఉన్నవిద్యుత్తు స్తంభాలు, వేలాడే తీగలను సరి చేయాలన్నారు. రహదారి కి ఇరువైపులా ఉన్న విద్యుత్ స్తంభాలకు రేడియం అంటించాలన్నారు.

రవాణా శాఖ, అధికారులు, వాహనాలను, స్కూల్ బస్సులను,తనిఖీలు చేపట్టాలన్నారు. రహదారి భవనాల శాఖ, పంచాయతి రాజ్, ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో గల రహదారులకు మరమ్మత్తులు, వంతెనల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. రహదారులపై స్పీడ్ బ్రేకర్లు, వేగ నియంత్రణ, సూచిక బోర్డులు, ఏర్పాటు చేయాలన్నారు.  ఎక్కడైనా ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని మునిసిపాలిటీలలో మండల కేంద్రాలలో వాహనాల రద్దీ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

మద్యం తాగి వాహనాలు నడిపే వారికి అతివేగంగా, హెల్మెట్, సీటు బెల్టు, ధరించని వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. రహదారి నియమాల పై పజలకు అవగాహన పర్చాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.ఈ సమావేశంలో డి. ఆర్. డి. ఓ దత్తారావు, రవాణా శాఖ అధికారి రామచందర్,డి. పి. ఓ భిక్షపతి ,ఎస్ ఇ విద్యుతు శాఖ ఉత్తం జాడే, పి. ఆర్. ఇ. ఇ ధర్మేందర్, విద్యా,  వైద్య నేషనల్ హైవే అధికారులు తదితరులు పాల్గొన్నారు.