10 April, 2026 | 6:23 PM

పశువులలో గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం

10-04-2026 04:15 PM

పెంచికలపేట,(విజయక్రాంతి): పెంచికల్పేట్ మండలంలోని కమ్మర్గాం, నందిగాం గ్రామాలలో ఉన్న నాలుగు నెలల వయసు పైబడిన పశువులకు,గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగముగా ఈ రోజు గేదెలకు  టీకాలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సులోచన భాస్కర్ గౌడ్  మండల పశు వైద్య అధికారి డాక్టర్ రాకేష్ ,రైతులు మధునయ్య, బాపు,పశువైద్య సిబ్బంది ఆనంద్ రావు,శివ కుమార్, శేఖర్ పాల్గొనడం జరిగింది.