10 April, 2026 | 6:27 PM

శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు

10-04-2026 04:21 PM

మంథని,(విజయక్రాంతి)ఫ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ భక్తంజనేయ స్వామి దేవస్థానంలో గురువారం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో కలిసి దేవాలయంలో ప్రార్థనలు నిర్వహించి, ప్రజల సుఖశాంతులు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ అ ఆంజనేయ స్వామి దైవ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.