17 March, 2026 | 5:08 AM

బండచెరువు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి

17-03-2026 02:32 AM

మేడ్చల్, మార్చి 16 (విజయక్రాంతి): బండచెరువును పరిరక్షిస్తూ ఆధునికరించాలని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి హైడ్రా కమిషనర్‌ను కోరారు. సోమవారం బుద్ధభవన్‌లో హైడ్రా కమిషనర్ ఎ.వి.రంగనాథ్‌ను కలిసి బండచెరువు సమస్యలపై ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు. చెరువులో ప్రస్తుతం పేరుకుపోయిన గుర్రపు డెక్క (చెత్త, మట్టిపొరలు) కారణంగా చెరువు పర్యావరణం దెబ్బతింటోందని, దీని వల్ల స్థానిక ప్రజలకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయని ఎమ్మెల్యే కమిష నర్‌కు వివరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్  సానుకూలంగా హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.