31 July, 2026 | 4:14 PM

కాంగ్రెస్ పార్టీలో చేరిన మండల నాయకులు

31-07-2026 03:14 PM

బోథ్,(విజయ క్రాంతి): డిసిసి అధ్యక్షులు డాక్టర్ నరేష్ యాదవ్ ఆధ్వర్యంలో బోత్ మండలంలోని కుచ్రియాల గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో శుక్రవారం చేరారు. పార్టీలో చేరిన వారిని మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామన్నారు.

కార్యక్రమంలో జిసిసి చైర్మన్ తిరుపతి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు పరమేశ్వర్, ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్ ,డిసిసి ప్రధాన కార్యదర్శి జి సంజీవ్, ఆదిలాబాద్ రూరల్ మండలం కాంగ్రెస్ అధ్యక్షులు వెంకన్న యాదవ్ , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దౌలత్ రావు, బొత్ కౌన్సిలర్ గిరీష్ మండల నాయకులు పన్నాల సమీందర్ రెడ్డి నాయకులు  బండారి సతీష్ మహమ్మద్ కౌసర్ తదితరులు పాల్గొన్నారు.