17 March, 2026 | 3:49 AM

సీఎన్జీ గ్యాస్ కొరత వెంటనే తీర్చాలి

17-03-2026 02:33 AM

ముషీరాబాద్, మార్చి 16(విజయక్రాంతి):  రాష్ట్రంలో గ్యాస్ (సీఎన్జీ ) కొరతతో చాలా మంది ఆటో,  క్యాబ్ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,  వారి జీవనోపాధి దెబ్బతింటుందని తెలంగాణ రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ జేఏసీ కన్వీనర్ బి. వెంకశం అన్నారు. పెరిగిన ఎల్‌పిజి గ్యాస్‌తోపాటు (సీఎన్జీ) కొరతను నిరసస్తూ తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నారాయణగూడ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా బి. వెంకటేశం మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలలో ఆటో కార్మికుల దీర్ఘకాలిక సమస్యలపై స్పందించాలని, లేని పక్షంలో ఈ నెల 25వ తేదీన ఇందిరాపార్క్ వద్ద వేలాది మంది ఆటో డ్రైవర్లతో భారీ ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వి. ప్రవీణ్ (టియుసిఐ), ఎ. సత్తిరెడ్డి (టిఎడిఎస్), ఎంఎ. సలీం (తెలంగాణ జాగృతి), శ్రీకాంత్ (సిఐటియు), యాదగిరి(టిఎన్ సిహెచ్. జంగయ్య, ఎస్. అశోక్, మున్నూరు కృష్ణ, యం. నర్సింహా, యం. శ్రీనివాస్, కొమురెల్లి బాబు, ఉమర్ ఖాన్, మురళి (ఎఐటియుసి) తదితరులు పాల్గొన్నారు.