దేవాదాయ శాఖలో పని చేయడం అదృష్టం
జగదేవపూర్,(విజయక్రాంతి): జగదేవ్‌పూర్ మండలం తీగుల్–నర్సాపూర్‌లోని కొండపోచమ్మ ఆలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన మహేందర్ రెడ్డికి శుక్రవారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు కలిసి ఆయనను శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు రమేష్ మాట్లాడుతూ... 34 సంవత్సరాలు దేవాదాయ శాఖలో ఉద్యోగం చేసి కొండపోచమ్మ అమ్మవారి సన్నిధిలో పని చేసి పదవి విరమణ పొందడం సంతోషం అన్నారు.విధి నిర్వహణలో మహేందర్ రెడ్డి చూపిన క్రమశిక్షణ, నిజాయితీ, సేవాభావాన్ని కొనియాడుతూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగ విరమణ అనంతరం ఆయన ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సిబ్బంది కనుకయ్య, శ్రీధర్ రెడ్డి, అనిల్,అర్చకులు రమేష్, లక్ష్మణ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.






