31 July, 2026 | 4:02 PM

గుండారెడ్డిపల్లిలో పౌర హక్కుల దినోత్సవం

31-07-2026 03:20 PM

కోహెడ,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డిపల్లి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా సర్పంచ్ పిల్లి బాబు, ఆర్ఐ బూడిద ఎల్లయ్యలు మాట్లాడుతూ.. అంటరానితనం నేరమన్నారు.  మూఢనమ్మకాల పై అవగాహన పెంచుకోవాలని గ్రామస్తులకు సూచించారు. కార్యక్రమం లో ప్రభుత్వ అధికారులు శ్రీనివాస్ రెడ్డి, బాలకృష్ణ, సంపత్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.