31 July, 2026 | 4:15 PM

గిల్ట్ బంగారం నిందితులు రిమాండ్ కు తరలింపు

31-07-2026 03:23 PM

మన గోల్డ్ సంస్థ పిర్యాదుతో  కేసు నమోదు....

జూన్ 29 న సునీల్ అనే వ్యక్తి రిమాండ్ కి తరలింపు....

నిందితుడి వాంగ్మూలంతో నిజ నిజాలు వెలికితీత....

బంగారం తాకట్టు పెట్టే విషయంలో ప్రజలు అప్రమత్తమై ఉండాలి..

మోసపోయిన వారు ఎవరైనా ఉంటే పోలీసులను ఆశ్రయించండి

నిందితుడు ముందాడారామచందర్ రిమాండ్ కు తరలింపు....

కారేపల్లి సి ఐ నూనావత్ సాగర్

కారేపల్లి,(విజయక్రాంతి): నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలను మోసం చేసిన ముందాడ రామచందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ బంగారు ఆభరణాలను అసలైనవిగా నమ్మించి రుణాలు పొందినట్లు విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సింగరేణి సర్కిల్ సీఐ నునావత్ సాగర్ మాట్లాడుతూ... జూన్ 10  వ తేదీన ఇల్లందు బ్రాంచ్ కు చెందిన ముత్తూట్ ఫైనాన్స్ లో తమ గోల్డ్ ను విడిపించాలి.

మన గోల్డ్ సంస్థకు సంప్రదించి బ్యాంక్ కు వెళ్లే క్రమంలో గూగులోత్ సునీల్ ధరావత్ రాకేష్ అనే వ్యక్తులు బస్వాపురం గ్రామ సమీపంలో  మన గోల్డ్ సంస్థకు చెందిన వ్యక్తి దగ్గర ఉన్న  5 లక్షల 80 వేల రూపాయలను కాజేసీ అక్కడి నుండి పరారయ్యారు. మన గోల్డ్ సంస్థ వారి ఫిర్యాదుతో జూన్ 10న కేసు నమోదు చేసినట్లు తెలిపారు.  కేసు నమోదు తో విచారణ చేపట్టగా జూన్ 29న సునీల్ అనే నిందితుడిని అరెస్ట్ చేసి విచారించగా అట్టి సొమ్మును కారేపల్లికి చెందిన వ్యాపారి రామచందర్ కు ఇచ్చినట్టు తెలిపారు.

నిందితుడి సమాచారంతో ముందాడా రామచందర్ అరెస్ట్ చేసి విచారించగా తన వాంగ్మూలం ఆధారంగా కేసుకు సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ మోసంలో మరికొందరి ప్రమేయంపై కూడా విచారణ కొనసాగుతోందని  గిల్ట్ బంగారం పేరుతో అమాయక ప్రజలు, ఆర్థిక సంస్థలను మోసం చేసే ముఠాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలనీ కోరారు. కారేపల్లి, ఇల్లెందు, భద్రాచలం, కొత్తగూడెం  తదితర  ప్రాంతాల్లో 30 మంది ఏజెంట్ లతో ఘరానా మోసాలకు పాల్పడినట్లు సమాచారం ఉందనీ అలాగే  అదుపులో ఉన్న నిందితుడు రామచందర్ ను కోర్టు లో హాజరు పరిచి తన వద్ద దొరికిన 15వేల రూపాయలు సెల్ఫోన్ అలాగే వెర్నా కారును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

నిందితులు సునీల్ ను జూన్29న రిమాండ్ కు తరలించగా,మరో నిందితుడు రాకేష్  పరారీలో ఉన్నట్లు తెలిపారు. బంగారం తాకట్టు పెట్టే ముందు సంబంధిత వ్యక్తులు, వస్తువుల నిజానిజాలను తప్పనిసరిగా నిర్ధారించుకోవాలి. ఇలాంటి మోసాలకు గురైన వారు ఎవరైనా ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలనీ తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, మోసగాళ్లపై కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. ఈ దర్యాప్తులో కారేపల్లి ఎస్‌ఐ బైరు గోపి, ఎస్‌ఐ శ్రీకాంత్ తో  పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.