17 March, 2026 | 6:31 AM

ఏసీబీ మెరుపు దాడులు

17-03-2026 02:31 AM

బడంగ్‌పేట టౌన్ ప్లానింగ్ విభాగంలో ప్రకంపనలు

రాజేంద్రనగర్, మార్చి 16 (విజయక్రాం తి): శంషాబాద్ జిహెచ్‌ఎంసి జోన్ పరిధిలోని బడంగ్పేట జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయం వేదికగా సోమవారం ఏసీబీ అధికారులు భారీ సోదాలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదులు అందడంతో ఏసీబీ సిటీ రేంజ్ -2 డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో 15 మంది సభ్యుల బృందం ఈ తనిఖీలు చేపట్టింది. ఏసీబీ దాడు ల సమాచారం అందగానే టౌన్ ప్లానింగ్ ఏసీపీ కిరణ్, టీపీఓ దినేష్ కార్యాలయం నుం చి పరారవ్వడం చర్చనీయాంశంగా మారింది.

ఈ తనిఖీలు పూర్తి కావడానికి మరో 9 గంటల సమయం పట్టే అవకాశం ఉందని డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. ‘నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేసినట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నాం. ప్రతి దస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం అని ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్  తెలిపారు. ఈ మెరుపు దాడులతో జీహెచ్‌ఎంసీ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.