గంటల వ్యవధిలో నిండుకుండలా మారి అణువు దూకిన కరత్వాడ చెరువు
31-07-2026 02:37 PM
బోథ్,(విజయక్రాంతి): మండలంలోని కరత్వాడ చెరువు పైన ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో గురువారం అకస్మాత్తుగా వరద పో. గురువారం మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రాజెక్టులో నీరు అంతంత మాత్రమే ఉండగా అకస్మాత్తుగా నీటి ప్రవాహం పెరగడంతో అలుగుపైనుండి నీరు ప్రవహించింది. చెరువు నిండుతుందో లేదో అని ఎదురుచూసిన స్థానిక రైతులు అకస్మాత్తుగా చెరువు నిండడంతో వర్షం వ్యక్తపరుస్తున్నారు. రవి పంట కింద నీరు ప్రతి ఏటా విడిచి పెడుతుండడంతో వేల ఎకరాలలో రవి కింద మొక్కజొన్న జొన్న పంటలు సాగుతున్నాయి. భారీ వర్షం రాకతో రైతుల్లో రబీ పంట సాగుపై భరోసా కలుగుతున్నది






