ఆలయాల అభివృద్ధికి చర్యలు
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- మంచిర్యాల జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మంచిర్యాల టౌన్/దండేపల్లి, జూన్ 13: ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ విశ్వనాథ ఆలయ అభివృద్ధి పనులకు మంత్రులు దుద్దిళ శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కలెక్ట ర్ కుమార్ దీపక్, మంచిర్యాల, రామగుండం ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్ సాగర్‌రావు, రాజ్ ఠాకూర్, మంచి ర్యాల మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్యలతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సం దర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తుందని తెలిపా రు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధికి రూ.2 ,216 కోట్లు ఇస్తున్నట్టు తెలిపారు. రాబోవు గోదావరి పుష్కరాల కోసం రూ.వెయ్యికోట్లు కేటాయిం చామని చెప్పారు.
దండేపల్లి మండలం గూడెంలో గల రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయ పునరుద్ధరణ పనులను మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, గండ్ర సత్యనారాయణ, మక్కన్ సింగ్ ఠాకూర్, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు ధర్ని మధుకర్, మహంకాళి స్వామిలతో కలిసి శంకుస్థాపన చేశారు.
రైతు సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధిలో భాగంగా గూడెం గుట్ట పరిధిలో 74 కోట్ల రూపాయల అంచనా వ్య యంతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు భూమి పూ జ చేసినట్టు తెలిపారు. రాష్ట్ర ఐ.టి. శాఖ మంత్రి మాట్లాడుతూ దేవాదాయ శాఖ అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, రాబోవు గోదావరి పుష్కరాలకు భారీగా నిధులు కేటాయించి పనులు చేపట్టినట్టు తెలిపారు.






