ఫోన్ ట్యాపింగ్ విచారణలో మంత్రి తుమ్మల
- ఆయన నివాసానికి సిట్ వెళ్లి..స్టేట్‌మెంట్ రికార్డ్
- కాల్ డేటా, లొకేషన్ ట్రాకింగ్ వంటి అంశాలపై వివరాల సేకరణ
- ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్‌కుమార్‌కూ నోటీసులు
- సిట్ విచారణకు హాజరు కావాలని సూచన
హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో మరో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక విచారణ బృందం(సిట్) అధికారులు శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు నివాసానికి వెళ్లి ఆయన స్టేట్‌మెంట్‌ను అధికారికంగా రికార్డు చేశారు. కాల్ డేటా, లొకేషన్ ట్రాకిం గ్ వంటి అంశాలపై వివరాలను సేకరించారు.
అలాగే ఎంపీ అనిల్‌కుమార్ యాద వ్, కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్‌కుమార్ యాదవ్‌కూ నోటీసులు పంపించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మంత్రి తు మ్మల నాగేశ్వరరావు ఫోన్ అక్రమంగా ట్యా పింగ్‌కు గురైనట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. 2023 ఎన్నికల వేళ ఖమ్మం రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన తుమ్మ ల టార్గెట్‌గా అప్పట్లో కొందరు నిఘా అధికారులు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు వి చారణలో ఆధారాలు లభ్యమయ్యాయి.
ఈ నేపథ్యంలోనే పోలీసులు అందించిన కీలక సమాచారం ఆధారంగా సిట్ అధికారులు శనివారం మంత్రి తుమ్మల ఇంట్లోనే ఆయన స్టేట్‌మెంట్‌ను నమోదు చేసుకున్నారు. ఆ సమయంలో తన ఫోన్ కాల్స్ డేటా, లొకేషన్ల ట్రాకింగ్, ప్రైవేట్ సంభాషణలను ఎలా నిఘా పెట్టారనే కోణంలో అధికారులు మం త్రి నుంచి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. బాధితుడిగా మంత్రి తుమ్మల ఇచ్చి న ఈ స్టేట్‌మెంట్ ఆధారంగా కేసు విచారణను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సిట్ సిద్ధమవుతోంది.
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై జరుగుతున్న విచారణలో ఇది కీలక పరిణామంగా భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేసి నట్టు వచ్చిన ఆరోపణలపై సిట్ అధికారులు విస్తృతంగా ఆధారాలు సేకరిస్తున్నారు. అదే సమయంలో ఈ కేసులో మరికొంతమంది కీలక నేతలకు కూడా నోటీసులు జారీ చేశా రు. ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్‌కుమార్ యాదవ్‌కు సిట్ అధికారులు నోటీసులు పంపించి, విచారణకు హాజరు కావాలని సూచించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకు లు, పోలీసు అధికారులు, ఇంటెలిజెన్స్ విభా గం పాత్రపై కూడా విచారణ కొనసాగుతోం ది. ఇప్పటికే పలు సాంకేతిక ఆధారాలు, కాల్ డేటాతో తదితర వివరాలను సిట్ అధికారులు సేకరిస్తున్నారు. గత ప్రభుత్వ హయాం లో జరిగిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే పలువురు ఉన్నతాధికారు లు జైలులో ఉండగా.. తాజాగా మంత్రి తు మ్మల ఇంట్లో జరిగిన సిట్ అధికారుల విచారణతో ఈ కేసు దర్యాప్తు మళ్లీ ఊపందు కుంది. రాబోయే రోజుల్లో ఈ కేసులో మరికొందరు రాజకీయ ప్రముఖులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.






