చిన్న కాంట్రాక్టర్లపై సర్కారు కక్ష
- ఆస్తులు అమ్మి అభివృద్ధి చేశాం..
- ప్రజాప్రభుత్వంలో రోడ్డున పడ్డాం
- పెండింగ్ బిల్లుల కోసం 18న ‘చలో హైదరాబాద్’ మహాసభ
- తెలంగాణ కాంట్రాక్టర్లు
హైదరాబాద్, జూన్ 13(విజయక్రాంతి): రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాముల వుతూ.. ఊరూరా రోడ్లు వేసి, భవనాలు కట్టి, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు అం దించిన చిన్న, మధ్యతరగతి కాంట్రాక్టర్లు ప్రజాప్రభుత్వంలో పెండింగ్ బిల్లులు రాక, బతుకుదెరువు కోల్పోయి రోడ్డున పడ్డా రు. రోడ్లు, -భవనాలు (ఆర్‌అండ్‌బీ), పం చాయతీరాజ్, ఇరిగేషన్, మున్సిపల్, విద్యుత్ వంటి కీలక శాఖల్లో పనులు చేసి దాదాపు నాలుగేళ్లు గడుస్తున్నా.. ప్రభు త్వం నుంచి బిల్లులు రాకపోవడంతో వారి జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి.
సీఎం రేవంత్‌రెడ్డి.. తమపై కక్ష ఎందుకు సాధిస్తున్నారని, తక్షణమే పెండింగ్ బిల్లులు ఇచ్చి తమను ఆదుకోవాలని తెలంగాణ చిన్నతరహా సివిల్ కాంట్రాక్టర్లు కన్నీరు పెడుతున్నారు. పెండింగ్ బిల్లుల కోసం ఈ నెల 18న ‘చలో హైదరాబాద్’ మహాసభను నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని పిలుపు ఇచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భవనంలో చలో హైదరాబాద్ మహాసభ పోస్టర్ ను వారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంట్రాక్టర్లు మాట్లాడుతూ తెలంగాణవ్యాప్తంగా కోటి రూపాయల నుంచి రూ.5కోట్ల లోపు పనులు చేసే చిన్న తరహా కాంట్రాక్టర్లే అత్యధికంగా ఉన్నారు. పెద్దపెద్ద బిల్డర్లకు ఆర్థి క వెసులుబాటు ఉన్నదని, కానీ అప్పులు తె చ్చి పనులు చేసిన చిన్న, మధ్యతరగతి కాం ట్రాక్టర్ల పరిస్థితి మాత్రం అత్యంత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఐదేళ్లుగా ఓపిక పట్టాం.
ఉన్న ఆస్తులు, ఇళ్లు తాకట్టు పెట్టాం. బ్యాంక్ బ్యాలెన్స్ అంతా శూ న్యమైంది. అప్పులు ఇచ్చిన వాళ్లు ఇంటి మీ దకు వస్తుంటే.. తలదాచుకోలేక, ఇంటికి వెళ్లలేక రోడ్డున పడ్డాం. ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు ఇంత చిన్నచూపు చూస్తోంది? మా పై ప్రజాప్రభుత్వానికి ఎందుకింత కక్ష? కాం గ్రెస్ ప్రభుత్వం ఎందుకు విడుదల చేయడం లేదు? అని కాంట్రాక్టర్లు కన్నీటిపర్యంతమవుతున్నారు.
గత ప్రభుత్వం తమ బిల్లులను పక్కన పెట్టడంతో తీవ్ర నష్టాలు చవిచూశామని, కొత్త ప్రభుత్వమైనా తమను ఆదుకుం టుందని ఆశపడ్డామని.. కానీ రేవంత్ ప్రభుత్వంలో నిరాశే ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని రకాల సంక్షే మ పథకాలకు నిధులు కేటాయిస్తున్న ప్రభు త్వం, రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసిన తమ బకాయిలను ఎందుకు చెల్లించడం లేదని నిలదీశారు. పెండింగ్ బిల్లులు రాక, అప్పుల బాధ తాళలేక ఇటీవల నాగర్‌కర్నూల్ జిల్లాలో ఒక కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. బిల్లులు రాకపోతే.. ఈ నెల 18న మహాసభలో ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు.






