28 March, 2026 | 2:21 AM

ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి

28-03-2026 12:19 AM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 

హనుమకొండ టౌన్, మార్చి 27 (విజయక్రాంతి): హనుమకొండ వడ్డేపల్లి టీచర్స్ కాలనీ పేస్టు లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించారు. లోకక్షేమం, శాంతి, సమృద్ధి కోసం నిర్వహించే, ఈ పవిత్ర వేడుకల్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా దేవాలయంలో సందర్శించి, సీతారాముల కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ లోక కళ్యాణార్ధం జరిగే సీతారాముల కళ్యాణం ప్రతి ఇంటికి శుభసాంతులు తీసుకురావాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఐశ్వర్యంతో ఉండాలని అన్నారు. సాయంత్రం సీతారాముల దివ్య శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఏనుకొంటి నాగరాజు, ఆలయ కమిటీ అధ్యక్షులు మండవ శేషగిరిరావు సభ్యులు ఆర్తి పరంకుశం, సత్యనారాయణ, దమయంతి, మాధవి లత, ప్రధానార్చకులు శశికాంత్ శర్మ, భక్తులు, స్థానిక ప్రజలు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.