21-02-2026 12:22:38 AM
ఘట్ కేసర్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): అనురాగ్ యూనివర్శిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆధ్వర్యంలో గణితశాస్త్రం పై అవగాహన సదస్సు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యావేత్తలు, పరిశోధకులు, శాస్త్రవేత్తలను ఒకే చోట చేర్చి గణితం వివిధ శాస్త్రీయ సాంకేతిక రంగాలలో పురోగతికి ఎలా చోదక శక్తిగా మారుతుందో చర్చించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యం అని నిర్వాహకులు తెలిపారు.
2 రోజుల సదస్సులో ఏఐ, ఎంఎల్, మ్యాథమెటికల్ మోడలింగ్, ఫ్లయిడ్ డైనమిక్స్, స్టాటిస్టక్సీ, సిస్టమ్ మోడలంగ్ వంటి రంగాలలో గణిత అనువర్తనాలపై లోతైన చర్చలు జరుగుతాయన్నారు. నూతన ఆవిష్కరణలు, సమస్యా పరిష్కార విధానాలు, భవిష్యత్ పరిశోధనా మార్గాలపై దృష్టి సారించి, అంతర్ క్రమశిక్షణా దృక్పధాన్ని ప్రోత్సహించటం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించటమే ప్రధాన లక్ష్యం అన్నారు.
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆంధ్ర విశ్వవిద్యా లయం వైస్ ఛాన్సలర్ జి.పి. రాజశేఖర్ అలాగే ఐఎఫ్‌ఎస్ గౌహతి నుండి డ్రీ నటీశన్ శ్రీనివాసన్ విచ్చేశారు. వీరి కలక ఉపన్యాసాలు సదస్సులో పాల్గొన్నవారికి వారి జ్ఞానాన్ని విస్తరించుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశంగా యూనివర్శిటీ డీన్లు, ప్రొఫెసర్లు అభిప్రాయపడ్డారు. ఈ సదస్సుకి సుమారు 300 మంది జిస్ట్రేషన్ చేసుకోవటం జరిగింది. ఈ కార్యక్రమానికి అనురాగ్ విశ్వవిద్యాలయు వివిధ విభాగాల డీన్లు, హెచ్.ఒ.డిలు, ప్రొఫెసర్ లు ముత్తారెడ్డి, సుధీర్ రెడ్డి సతీష్ కుమార్, వి.ఎస్. రావు హాజరయ్యారు.