2 May, 2026 | 1:10 PM

Breaking News

అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు... పట్టించిన సీసీటీవీ ఫుటేజ్   •   వెలిమినేడు నోష్ ల్యాబ్ వద్ద కార్మికుల ధర్నా   •   ‘ప్రజాదర్బార్’లో ప్రజల సమస్యలకు పరిష్కారం – ప్రజల వద్దకే పాలన   •   శంషాబాద్ ORR ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి   •   లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం   •   విజయ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు   •   ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి   •   రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై కేసు నమోదు   •   బెంగాల్‌లో రీపోలింగ్: తొలి 2 గంటల్లో 16.23 శాతం ఓటింగ్   •   వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా   •  

తాగునీటి సమస్య రాకుండా కలిసికట్టుగా కృషి చేద్దాం

10-03-2026 12:41 AM

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంలో నంబర్ వన్‌గా నిలవాలి

రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 

కరీంనగర్, మార్చి 9 (విజయక్రాంతి): గ్రామాల్లో తాగునీటి సమస్య ఎక్కడా తలెత్తకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు కలి సికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర రవాణా, బీ సీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి సైదాపూర్ మండలాల్లో జరిగిన సన్నాహక సమావేశాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం గొప్ప కార్యక్రమం అని దీంతో గ్రా మాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవచ్చని పేర్కొన్నారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. గ్రా మాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పంచాయతీ కార్యదర్శులు సర్పంచులు మండల జిల్లా స్థాయి అధికారు లు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలులో చిగురుమామిడి, సైదాపూర్ మండలాలను నంబర్ వన్గా నిలపాలని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కూడా అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి వ్యక్తికి సంబంధించిన హెల్త్ ప్రొఫైల్ తయారు చేసి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యాలు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయని పేర్కొన్నారు. ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నారు. 

ఈ కార్యక్రమంలోస్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, ఆర్డీవో కే మహేశ్వర్ డిపిఓ జగదీశ్వర్ డి ఆర్ డి ఓ శ్రీధర్ జిల్లా వైద్యాధికారి వెంకట రమణ సంక్షేమ అధికారి సరస్వతి హౌసింగ్ పిడి శ్రీనివాస్ స్పెషల్ ఆఫీసర్లు, వివిధ శాఖల జిల్లా మండల స్థాయి అధికారులు సర్పంచులు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.