26 April, 2026 | 2:15 AM

నారాయణ విద్యా సంస్థల భారీ విస్తరణ

26-04-2026 12:40 AM

దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లో 38 క్యాంపస్‌లతో ఏర్పాటు

హైదరాబాద్, ఏప్రిల్ 25(విజయక్రాంతి): ప్రముఖ విద్యా సంస్థ ‘నారాయణ విద్యాసంస్థలు’ తమ 47 ఏళ్ల విద్యా ప్రస్థానంలో మరో కీలక మైలురాయిని చేరుకున్నాయి. 2026 27 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 38 క్యాంపస్‌ల ను ప్రారంభిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. నాణ్యమైన విద్యను విద్యార్థులకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ భారీ విస్తరణ చేపట్టినట్లు సంస్థ వెల్లడించింది.

కొత్త్త క్యాంపస్‌ల వివరాలు..

ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో అత్యధికంగా 15 కొత్త క్యాంపస్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 11 పాఠశాలలు, 4 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు వంటి నగరాల్లో ఇవి ప్రారంభం కానున్నాయి. దీంతో ఏపీలో నారాయణ క్యాంపస్‌ల మొత్తం సంఖ్య 407 చేరుకుంది. 

తెలంగాణ: తెలంగాణలో 10 కొత్త క్యాంపస్‌లను (5 పాఠశాలలు, 5 జూనియర్ కళాశా లలు) ప్రారంభిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు నిజామాబాద్, సంగారెడ్డిలలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం క్యాం పస్‌ల సంఖ్య 244కు చేరింది.

మహారాష్ట్ర: ముంబై రీజియన్‌తో పాటు ధారాశివ్‌లో కలిపి 5 కొత్త క్యాంపస్‌లను (2 పాఠశాలలు, 3 కోచింగ్ సెంటర్లు) ఏర్పాటు చేశారు.

గుజరాత్: రాజ్‌కోట్, సూరత్, వడోదరల లో 3 కొత్త పాఠశాలలను ప్రారంభించడంతో అక్కడ మొత్తం క్యాంపస్‌ల సంఖ్య 5కి చేరింది. 

తమిళనాడు: ఈరోడ్, మధురై, చెన్నైలలో 3 కొత్త పాఠశాలలను ప్రారంభించారు.

మధ్యప్రదేశ్: ఇండోర్, గుణలలో 2 కొత్త పాఠశాలలను ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఈ విస్తరణలో 26 పాఠశాలలు, 9 జూనియర్ కళాశాలలు, 3 కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. దీంతో భారతదేశ వ్యాప్తంగా నారాయణ విద్యా సంస్థల మొత్తం క్యాంపస్‌ల సంఖ్య 952 కు చేరుకుంది.

ఈ సందర్భంగా నారాయణ విద్యాసంస్థల ప్రెసిడెంట్ పునీత్ కొత్తప మాట్లాడుతూ ‘దేశంలోని ప్రతి జిల్లాలో ఒక నారాయణ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలన్న దే తమ లక్ష్యమన్నారు. విద్యార్థుల ఎదుగుదలలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పాత్ర ఎంతో కీలకమని నారాయణ భావిస్తోందన్నా రు. విద్యార్థుల కలలను నిజయం చేయ డమే నారాయణ లక్ష్యం’అని పేర్కొన్నారు.

ఆధునాతన డిజిటల్ లెర్నింగ్, పర్సనలైజ్డ్ మెంట రింగ్, సంపూర్ణ వికాసంతో కూడిన విద్యా విధానాన్ని అందించేందుకు నారాయణ ఎల్లప్పుడు కట్టుబడి ఉంటుందని సంస్థ ప్రతి నిధు లు తెలిపారు. విద్యార్థుల కలలను సాకారం చేయడమే నారాయణ విద్యా సంస్థల ధ్యేయమని పేర్కొన్నారు.

నారాయణ విద్యా సంస్థల గురించి..

౪౭ ఏళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన నారాయణ విద్యాసంస్థలు, ఆసియాలోనే అతిపెద్ద, అత్యంత గౌరవనీయమైన విద్యా సంస్థ ల్లో ఒకటి. భారతదేశంలోని 23 రాష్ట్రాల్లో, 250కి పైగా నగరాల్లో 950కి పైగా పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు, వృత్తి విద్యా కళాశాలలతో విస్తరించి ఉన్న భారీ నెట్‌వర్క్ నారాయణ సొంతం.

దాదాపు 50,000 మందికిపైగా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయు లు, ఆర్‌అండ్‌డీ హెడ్స్, సబ్జెక్ట్ నిపుణులు నారాయణలో సేవలు అందిస్తున్నారు. కిండర్ గార్డెన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు దా దాపు 6 లక్షల మంది విద్యార్థులు నారాయణలో విద్యను అభ్యసిస్తున్నారు. విద్యా ర్థుల్లో మేథోశక్తిని వెలికితీయడానికి ప్రత్యేక పాఠ్య ప్ర ణాళికలతో పాటు సహ పాఠ్య ప్రణాళికలు మ ధ్య సమతుల్యత పాటించటం నారాయణ ప్ర త్యేకత.

ఇంజినీరింగ్, మెడికల్, సీఏ, సివిల్స్ వంటి విభాగాల్లో విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రత్యేకంగా రూపొందించిన అకడమిక్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. దేశవ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థుల కలలను సా కారం చేయడమే లక్ష్యంగా నారాయణ వి ద్యా సంస్థలు ముందుకు సాగుతున్నాయి. ఎందుకంటే నారాయణలో మీకలలే మా కలలు!