31 May, 2026 | 5:11 PM

వైభవంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతావేడుకలు

31-05-2026 04:11 PM

దంపతులు, భక్తులతో కిక్కిరిసి పోయిన  శివాలయం

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ శివాలయంలో ఆదివారం అధిక జ్యేష్ట మాసం పౌర్ణమి నీ పురస్కరించుకొని చైర్మెన్ అల్లెంకి సత్యనారాయణ భాగ్యలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో లోక కల్యానార్థం సామూహిక సత్యనారాయణ వ్రతం వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండువగ జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు వల్ల కొండ మఠం రమేష్  దంపతులచే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిపించారు.

ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ... అధిక మాసంలో విశిష్టంగా లక్ష్మీనారాయణ పూజ,అర్చకులకు అధిక వాయానలు ఇవ్వడం చాలా శ్రేయస్కరం అని, సిరిసంపదలకు ఎలాంటి లోటు ఉండదు అని ,అధికమాసంలో లక్ష్మీనారాయణ స్వామి, శ్రీ కృష్ణున్నీ,కొలవడం సత్యనారాయణ వ్రతాలను ఆచరించడం, చాలా శ్రేయస్కరం, ఏ పూజ అయినా ఏ వ్రతమైన, హోమమైన, సామూహికంగా ఆచరించడం, అది అధికమాసంలో చేయడం వలన సమస్త పట్టణ, ప్రజలకు, యోగక్షేమమని అర్చకులు వల్లకొండ మఠం రమేష్ తెలియజేసిన్నారు. ఈ కార్యక్రమం లో  ఆలయ డైరెక్టర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆలయ పట్టణ భక్త బృందం, ఆర్య వైశ్య సోదరులు, పెద్ద ఎత్తున మహిళలు, పాత్రికేయ సోదరులు పాల్గొన్నారు. అనంతరం,తీర్థ ప్రసాదాలు అందజేశారు, చైర్మెన్,భక్త బృందం చే అన్నప్రసాద వితరణ జరిగినది.