18 July, 2026 | 8:27 PM

Breaking News

మంత్రి గడ్డం వివేక్ ను కలిసిన అఖిలపక్ష నాయకులు   •   మంత్రి గడ్డం వివేక్ ను కలిసిన అఖిలపక్ష నాయకులు   •   ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించండి   •   ఎల్నినో ప్రభావంతో రైతులు ఆరుతడి పంటల సాగు వైపు మొగ్గు చూపాలి   •   బీఆర్ఎస్ కార్యకర్త తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే   •   పార్టీ కార్యకర్తలను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వైఖరి!   •   కేసుల పరిష్కారానికి కృషి జరగాలి   •   ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయండి   •   సూర్యాపేట జిల్లా సృష్టికర్త జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   అదనపు తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే   •  

సర్వేలులో సామూహిక అక్షరాభ్యాసం

24-01-2026 12:15 AM

సంస్థాన్ నారాయణపూర్,జనవరి 23 : చిన్ననాటి నుండే క్రమశిక్షణతో కూడిన విద్యాబుద్ధులు నేర్పి వారిని ప్రయోజకులుగా తీర్చి దిద్దే భాద్యత మన అందరిపై ఉందని సర్వేలు గ్రామ సర్పంచ్ చిలక రాజు చందన రాజు అన్నారు. శుక్రవారం సర్వేలు ఎర్రగుంట మరి గూడెం లోని అంగన్వాడి కేంద్రాలలోని విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ చిలకరాజు చందన రాజు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అంగన్వాడి కేంద్రాలను తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే సహకారంతో కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు బోయ చందు, సిలివేరు సువర్ణ గాలయ్య , వీరమల్ల నర్సింహ, రమాదేవి నరసింహ, సెక్రటరీ చంద్రశేఖర్, అంగన్వాడి టీచర్లు ఈ.దేవిక,కే.సత్తమ్మ, కే.శైలజ, వి.శోభ, ఈ. భాగ్యలక్ష్మి, ఏఎన్‌ఎం ముత్యాలు, అండాలు, ఆశ వర్కర్లు , సుగుణమ్మ సరిత కవిత, మాజీ సర్పంచ్  మానుపాటి సతీష్ కుమార్,  గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.