calender_icon.png 20 January, 2025 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్‌పై మార్కెట్ ఫోకస్

20-01-2025 12:01:01 AM

ఈ వారం స్టాక్ సూచీల కదలికలపై విశ్లేషకుల అంచనాలు

ముంబై,  జనవరి 19: యూఎస్ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారంపై  ప్రస్తుతం  మార్కెట్ దృష్టి నిలిచిఉందని విశ్లేషకులు తెలిపారు. జనవరి 20 సోమవారం  భారత కాలమాన ప్రకారం రాత్రి 10 గంటలకు ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారు. ఆ సందర్భంగా వాణిజ్య విధానాలపై ట్రంప్ చేసే వ్యాఖ్యానాలు అంతర్జాతీయ మార్కెట్లను తద్వారా భారత స్టాక్ సూచీలను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు వివరించారు.

అమెరికా అధ్యక్షుడిగా రెండవ దఫా పదవిలోకి వస్తున్న డొనాల్డ్ ట్రంప్‌పై అంతర్జాతీయంగా అందరి దృష్టి ఉన్నదని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ చెప్పారు. అలాగే కార్పొరేట్ల క్యూ3 ఫలితాలు,  విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) ట్రేడింగ్ యాక్టివిటీపై మార్కెట్ దృష్టి నిలిచి వున్నదన్నారు.   

విదేశీ ఇన్వెస్టర్లు అదేపనిగా విక్రయాలు జరపడంతో భారత మార్కెట్‌పై ఒత్తిడి ఏర్పడు తున్నదని, కొత్త ఏడాదిలో వారి వైఖరి ఆధారంగా సమీప భవిష్యత్‌లో ట్రెండ్ ఉంటుం దని వివరించారు.  డాలర్ మా రకపు రేటు, ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధరలు కూడా మార్కెట్ దిశను నిర్దేశించే అం శాలేనని మాస్టర్‌ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా తెలిపారు.

అదేపనిగా పడిపోతున్న రూపాయి విలువను కూడా ఇన్వెస్టర్లు ట్రాక్ చేస్తున్నారని, కరెన్సీ కదలికలు కూడా స్టాక్స్ కదలికల్ని ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. కార్పొరేట్  ఫలితాలు, ద్రవ్యోల్బణం గణాంకాలు,  క్రూడ్ ధరల పెరుగు దల గ్లోబల్ ట్రెండ్ తదితరాలు మార్కెట్‌ను తీవ్ర ఒడిదుడుకులకు లోనుచేస్తాయని జి యోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హె డ్ వినోద్ నాయర్ అంచనా వేశారు.

జనవరి 17తో ముగిసిన వారం మొత్తంమీద  సెన్సెక్స్ 759 పాయింట్ల  నష్టాన్ని చవిచూడగా, నిఫ్టీ 228 పాయింట్లు కోల్పోయింది. సెన్సెక్స్ 76,619 పాయింట్ల వద్ద, నిఫ్టీ 23,203 పాయింట్ల వద్ద ముగిసాయి. గత శుక్రవారం డాలరు మారకంలో రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ఠస్థాయి 86.56 వద్ద ముగిసింది.  ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 81 డాలర్ల వద్దకు ఎగిసింది.

యూఎస్ డాలర్ పటిష్ఠత, యూఎస్ బాండ్ ఈల్డ్స్ పెరుగుదల, గరిష్ఠ క్రూడ్ ధరలు గతవారం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీ శాయని, ఈ వారం కూడా మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతుందని విశ్లేషకులు అంచ నా వేశారు.

జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారంపై గణనీయమైన ఫోకస్ ఉన్నదని, ప్రత్యేకించి అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రభావితం చేసే  టారీఫ్‌లపై తొలి ప్రకటనలు ఏవై నా వెలువడతాయా అన్న ఆతృత ఉన్నదని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు. 

తరలిన రూ.44, 396 కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు 

 దేశీయ స్టాక్ మార్కెట్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెసర్ల (ఎఫ్‌పీఐలు) విక్రయాల జోరు పెంచారు. జనవరి నెలలో ఇప్పటివరకూ రూ.44,396 కోట్ల పెట్టుబడుల్ని ఎఫ్ పీఐలు వెనక్కు తీసుకున్నట్లు  డిపాజిటరీల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  డిసెంబర్ నెల మొత్తంమీద రూ.15,446 కోట్లు నికరం గా ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌పీఐలు తిరిగి జనవరిలో అమ్మకాలకు తెరతీశారు.

డిపాజిటరీల డేటా ప్రకారం జనవరి 17 వరకూ ఎఫ్‌పీఐ లు రూ.44,396 కోట్ల  విలువైన స్టాక్స్‌ను నికరంగా విక్రయించారు. జనవరి 2 మినహా మిగిలిన అన్ని ట్రేడింగ్ రోజుల్లోనూ వీరి విక్రయాలు కొనసాగాయి. అదేపనిగా క్షీణించిన రూపాయి  విదేశీ ఇన్వెస్టర్లపై గణనీయమైన ఒత్తిడి పెట్టిందని, దానితో భారత ఈక్వి టీ మార్కెట్ల నుంచి పెట్టుబడుల్ని వెనక్కు తీసుకున్నారని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. 

రూపాయి క్షీణతకు తో డు భారత మార్కెట్ అధిక విలువలు, కార్పొరేట్ల బలహీన ఫలితాలు, ఆర్థికాభివృద్ధిపై సం దేహాలు ఎఫ్‌పీఐల అమ్మకాలకు కారణమని వివరించారు. రానున్న రోజుల్లో భారత ఈ క్విటీ మార్కెట్లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు అమెరికా అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్న డోనాల్డ్ ట్రంప్ అమలుపర్చే విధానా లు, ద్రవ్యోల్బణం ట్రెండ్, కేంద్ర బ్యాంక్‌ల వ డ్డీ రేట్ల సరళిపై ఆధారపడి ఉంటాయని  శ్రీ వాస్తవ చెప్పారు.

డాలర్ పటిష్టంగా ఉం టూ యూఎస్ బాండ్ ఈల్డ్స్ ఆకర్షణీయమైన రాబడులు ఇస్తున్నంతకాలం ఎఫ్‌పీఐలు భా రత్ మార్కెట్లో విక్రయాలు కొనసాగిస్తారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ తెలి పారు.

ప్రస్తుతం డాలర్ ఇండెక్స్ 109 సమీపంలోనూ, 10 ఏండ్ల బాండ్ ఈల్డ్ 4.7 శా తం ఎగువన కొనసాగుతున్నదన్నా రు. 20 22లో రూ.1.21 లక్షల కోఉ్ల వెనక్కు తీసుకు న్న ఎఫ్‌పీఐలు 2023లో భారీగా 1.71 లక్షల కోట్లు భారత ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌చేశారు. 2024లో మాత్రం వీరి నికర పెట్టుబడులు రూ.2,026 కోట్లకే పరిమితమయ్యాయి. 

క్యూ3 ఫలితాలు

ఈ వారం మార్కెట్ కదలికల్ని కార్పొరేట్లు వెల్లడించే క్యూ3 ఫలితాలు కూడా ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు తెలిపారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర బ్లూచిప్ కంపెనీలు ఈ వారమే ఫలితాల్ని వెల్లడిస్తాయి. నిఫ్టీ సూచీలో భాగమైన బీపీసీఎల్, హిందుస్థాన్ యూనీలీవర్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఆర్థిక ఫలితాలు కూడా ఈ వారమే వెలువడతాయి.

ఒకవైపు ఫలితాల సీజన్‌పై ఇన్వెస్టర్లు కన్నేసి ఉంచుతూ మరోవైపు వచ్చే కేంద్ర బడ్జెట్‌పై దృష్టిసారిస్తారని మోతీలాల్ ఓస్వాల్ వెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ్ ఖెమ్కా తెలిపారు. బడ్జెట్లో ప్రకటించే విధాన చర్యలు, వృద్ధి విధానాలు, కీలక రంగాలకు జరిపే ఆర్థిక కేటాయింపులు అంచనాలు ఏర్పర్చుకుని, అందుకు అనుగుణమైన పొజిషన్లను మార్కెట్లో తీసుకుంటారని, దీనితో మార్కెట్లో ఒడిదుడుకులు ఏర్పడతాయని ఖెమ్కా వివరించారు.

ప్రమాణ స్వీకారం అనంతరం ట్రంప్ చేసే విధాన ప్రకటనలు అంతర్జాతీయ మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తుందని చెప్పారు. అంతర్జాతీయ పరిణామాలపై దృష్టిపెడుతూ ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తారని, దీనితో మార్కెట్‌లో కరెక్షన్లు జరుగుతాయని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే చెప్పారు.