13 August, 2026 | 9:44 PM

మేడిపల్లి ఏసీపీ కార్యాలయంలో సీపీ సుమతి ఆకస్మిక తనిఖీ

13-08-2026 08:22 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసు అధికారుల పనితీరును పరిశీలించే క్రమంలో సీపీ సుమతి గురువారం మేడిపల్లి ఏసీపీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌కు చేరుకున్న సీపీకి సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటారు.ఉప్పల్‌ డీసీపీ సురేష్‌ కుమార్‌తో కలిసి మేడిపల్లి ఏసీపీ మోహన్‌ కుమార్‌తో పాటు ఏసీపీ పరిధిలోని ఇన్‌స్పెక్టర్లతో సీపీ సుమతి సమీక్ష నిర్వహించారు.

ఏసీపీ పరిధిలో నమోదైన కేసులు, పెండింగ్‌ కేసుల దర్యాప్తు, సిబ్బంది వివరాలు, వివిధ పోలీస్‌స్టేషన్లలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు.దసరా లోపు మల్కాజిగిరి కమిషనరేట్  నూతన కార్యాలయాన్ని  ప్రారంభిస్తామని  తెలిపారు.ఈ కార్యక్రమంలో సీఐలు జలేందర్ రెడ్డి,బాలస్వామి,జగన్నాథం, సుధాకర్,ఎస్ఐ లు పాల్గొన్నారు.