ముంబై: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో సోమవారం త్రైమాసిక ఫలితాల ను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.59 కోట్లుగా పేర్కొంది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే లాభం 57.2 శాతం క్షీణించడం గమనార్హం. గత ఏడాది రూ.138 కోట్ల నికర లాభం ప్రకటించిన జొమాటో గత త్రైమాసికంలో రూ.176 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.
అయితే కార్యకలాపాలద్వారా వచ్చే ఆదాయం 64 శాతం పెరగడం గమనార్హం. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.3,288 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ సారి రూ.5,405 కోట్లకు పెరిగింది. ఖర్చులు సైతం రూ.3,383 కోట్లనుంచి రూ.5,533 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలపింది. ఫలితాల నేపథ్యంలో రోజంతా లాభాల్లో పయనించిన జొమాటో ఫేరు ఫలితాల అనంతరం బీఎస్‌ఈలో 3 శాతం మేర క్షీణించి రూ.240 వద్ద ముగిసింది.