డెలాయిట్ అంచనా
న్యూఢిల్లీ, జనవరి 19: దేశీయ కరెన్సీ స్థిరత్వం పట్ల రిజర్వ్‌బ్యాంక్ దృష్టిపెడుతున్నందున, రానున్న వారాల్లో రూపాయి కొంతమేరకు రిక వరీ అవుతుందని డెలాయిట్ ఎకాన మిస్ట్ రుక్మి మజుందార్ అంచనా వేశారు. అయితే ఆర్బీఐ ఫారెక్స్ మా ర్కెట్లో జోక్యం చేసుకున్నా రూపాయి తిరిగి 83 స్థాయిని చూడదని, రాను న్న వారాల్లో 85 శ్రేణిలో స్థిరప డవచ్చని మజుందార్ చెప్పారు. గత వారం డాలరు మారకంలో 86.70 ఆల్‌టైమ్ కనిష్ఠస్థాయిని తాకింది. 2024లో 3 శాతం క్షీణించిన రూపా యి 2025లో ఇప్పటికే 1 శాతం పడిపోయింది.