2 May, 2026 | 4:24 AM

పెద్ది వచ్చేది జూన్ 4నే

02-05-2026 03:12 AM

స్టార్ హీరో రామ్‌చరణ్ రూరల్ యాక్ష న్ డ్రామా ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేక ర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ ఉండటంతో అభిమానుల్లో నెలకొన్న గందరగోళానికి తెర దించుతూ చిత్రబృందం రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుందని వెల్లడించారు.  

బుచ్చిబాబు ఎలాంటి సినిమా అయినా చేయగలడు: సుకుమార్  

శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ప్రెస్‌మీట్‌కు ప్రముఖ దర్శకుడు సుకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుకుమార్ మా ట్లాడుతూ.. “ఉప్పెన’ క్లైమాక్స్ చూసినప్పుడు ఆ సినిమా తీసిన డైరెక్టర్ ఎలాంటి సినిమా అయినా చేయగలడు అనిపించింది. బుచ్చిబాబు ‘పెద్ది’ కోసం మంచి స్క్రిప్ట్ రాశాడు. ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్‌ను అద్భుతంగా బ్యాలెన్స్ చేశాడు. అలాంటి బ్యాలెన్స్ పట్టుకోవాలంటే చాలా అనుభవం ఉండాలి. ‘పెద్ది’ లాంటి కమర్షియల్ ఎమోషనల్ రైడ్ ఈ మధ్యకాలంలో రాలేదు. స్క్రీన్‌పై సాంగ్స్ చూసినప్పుడు సినిమా వేరే లెవెల్లో అనిపించింది. టీజర్ విజువల్స్ మామూలుగా లేవు. చరణ్ డాన్స్ చూస్తుంటే మాటలు రావడం లేదు.

అంత అద్భుతమైన ఎనర్జీతో డాన్స్ చేశాడు. ‘పెద్ది’లో చరణ్ పర్ఫార్మెన్స్ ‘రంగస్థలం’ను దాటి నెక్స్ లెవల్‌లో ఉంటుంది.  ఇందులో నన్ను భాగస్వామ్యం చేసినందుకు రామ్‌చరణ్‌కు థాంక్యూ. జూన్ 4న ఈ సిని మా హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది” అని తెలిపారు. దర్శకుడు బుచ్చిబాబు మాట్లా డుతూ.. “పెద్ది’ ఏప్రిల్ 30న రానందుకు క్షమించండి. జూన్ 4న వస్తున్నందుకు ఆశీర్వదించండి (నవ్వుతూ). ఇది ఒక కమర్షియల్ ఎమోషనల్ రైడ్. ‘పెద్ది’ని మీ హృదయం నుంచి తీసేయడం అంత ఈజీ కాదు” అన్నారు. నిర్మా త వెంకట సతీశ్ కిలారు మాట్లాడుతూ.. “నా మొదటి సినిమాగా ఇంత పెద్ద సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు రామ్‌చరణ్‌కు జీవిత కాలం రుణపడి ఉంటా.

పెద్ది కమర్షియల్, ఎమోషనల్ రైడ్ ఇది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ థియేటర్లలో చూడగలిగే సినిమా. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది, నిర్మాతగా చాలా హ్యాపీగా ఉన్నా. జూన్ 4న సినిమా రిలీజ్ అవుతోంది. జూన్ 3న సాయంత్రం అన్ని చోట్ల ప్రీమియర్స్ ఉంటాయి. షూటింగ్ జరిగిన రోజులన్నీ రామ్‌చరణ్‌తో కలిసి భోజనం చేసే అవకాశం దొరికింది. ఆయన ఇంటి నుంచి తీసుకొచ్చిన భోజనం మాకు పెట్టేవారు. ఆ అనుభవం నా జీవితంలో మర్చి పోలేనిది” అని చెప్పారు. ‘పెద్ది కోసం ప్రాణం పెట్టి పని చేశాన’ని డీవోపీ రత్నవేలు తెలిపారు.