12-02-2026 05:52:53 PM
- బ్రాంచ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేత
హనుమకొండ,(విజయక్రాంతి): నయీమ్ నగర్ లో గల మోషన్ జూనియర్ కళాశాల హన్మకొండ హెడ్ బ్రాంచ్ ప్రిన్సీపాల్ గా మారపల్లి సమ్మయ్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా గురువారం మోషన్ జూనియర్ కళాశాల చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు.
మారపల్లి సమ్మయ్య కెమిస్ట్రీ విభాగంలో నారాయణ జూనియర్ కళాశాలలో గత 24 సంవత్సరాలుగా విద్యార్థులకు విద్యా బోధనలు చేస్తూ, అనేకమంది విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర ఎనలేనిదని, ఆయన సేవలను మరింతగా ఉపయోగించుకునేందుకు మోషన్ జూనియర్ కళాశాల హెడ్ బ్రాంచ్ ప్రిన్సిపాల్ గా నియమించినట్లు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ తెలిపారు.
ఈ సందర్భంగా నూతనంగా మోషన్ జూనియర్ కళాశాల హన్మకొండ హెడ్ బ్రాంచ్ ప్రిన్సిపాల్ గా నియమితులైన మారపల్లి సమ్మయ్య మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ప్రిన్సిపల్ గా నియమించిన మోషన్ జూనియర్ కళాశాల యజమాన్యం ఆశలను వమ్ము చేయకుండా విద్యార్థులు నీట్, జేఈఈ మెయిన్స్ తో పాటు ఎంసెట్లో రాణించే విధంగా కృషి చేస్తానని, తనను ప్రిన్సిపాల్ గా నియమించిన మోషన్ జూనియర్ కళాశాల యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.