17 August, 2026 | 6:03 PM

ఆలేరులో మండల స్థాయి ప్రజావాణి.. 12 ఫిర్యాదుల స్వీకరణ..

17-08-2026 04:44 PM

ఆలేరు, ఆగస్ట్ 17 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆలేరు మండల కేంద్రంలో సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించారు. నోడల్‌ ఆఫీసర్‌, ఎంపీడీవో ఎం. సత్య ఆంజనేయ ప్రసాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆంజనేయులు, మెడికల్ ఆఫీసర్ హైమావతి, వెటర్నరీ డాక్టర్ చైతన్య, సీడీపీఓ స్వరాజ్యం, ఎంపీఓ అనురాధ, ఏపీఓ అరుణతో పాటు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

ప్రజావాణికి ఆలేరు మండలం, మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు హాజరై తమ సమస్యలపై మొత్తం 12 ఫిర్యాదులను నమోదు చేశారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 4, మున్సిపాలిటీకి 4, మైన్స్ శాఖకు 2, ట్రైబల్ వెల్ఫేర్‌కు 1, సివిల్ సప్లై శాఖకు 1 ఫిర్యాదు అందాయి. ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, తదుపరి చర్యల కోసం సంబంధిత శాఖలకు పంపించారు. అలాగే ఇటీవల జిల్లా స్థాయిలో అవార్డులు పొందిన తహసీల్దార్ ఆంజనేయులు, ఏఈఓ శివకుమార్ లను ప్రజావాణి మండల బృందం అభినందించి సన్మానించింది.