calender_icon.png 22 February, 2026 | 12:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించండి

21-02-2026 02:09:09 AM

దేవరకద్ర, ఫిబ్రవరి 20 : ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రజలు ఎవ్వరికి ఇబ్బందులు రాకుండా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమర్థవంతమైన పరిపాలన అందించాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం దేవరకద్ర మున్సిపాలిటీ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్మన్ దమయంతి, వైస్ చైర్మన్ యుగంధర్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు.

మీరు చేసిన మంచి మీకు చిరస్థాయిగా నిలిచి ఉంటుందని అది పది కలలా పాటు మీ పేరు పదిలంగా ఉండేలా చేస్తుందని తెలిపారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి మేమున్నామని భరోసా ఇవ్వాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటున్నామని స్పష్టం చేశారు. అలాగే దుప్పల్లి గ్రామానికి చెందిన బత్తుల లక్ష్మన్న కుమారుడికి సంబంధించి రూ 1 లక్ష సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అధికారులు తదితరులు ఉన్నారు.