బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించండి
జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా
జడ్చర్ల, సెప్టెంబర్ 2: తమ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తే ప్రజలకు సరైన సదుపాయాలు అందుబాటులో ఉంటాయనిజిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా (District Collector Khushboo Gupta) అన్నారు. జడ్చర్ల మండలం ఖానాపూర్ గ్రామంలో జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా బుధవారం పర్యటించి రిసర్వే పనులు, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. రిసర్వే ద్వారా భూముల వివరాలు, హద్దులు స్పష్టంగా నమోదవుతాయని, గ్రామస్థులు అధికారులకు సరైన వివరాలు అందించి సహకరించాలని కోరారు.
పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత, విద్యార్థులకు అందుతున్న గుడ్లు, పౌష్టికాహారంపై ఆరా తీశారు. అంగన్వాడీ కేంద్రంలో విద్యుత్, లైటింగ్, ఫ్యాన్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో విద్యుత్ సరఫరా అంతరాయాల సమస్యను కూడా పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం లో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ, జడ్చర్ల తహసీల్దార్ నర్సింగ్రావు, గ్రామ సర్పంచ్ తదితరులు ఉన్నారు.






