ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు
30-05-2026 10:21 PM
బోథ్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని లేండిగూడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సోనాల మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డు పైన ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు సోనాల ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా ఆసుపత్రి మూసి ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే జరిగిన విషయాన్ని బోత్ ఎస్ఐకి తెలిపిన కొందరు అదే బస్సులో బోత్ ఆసుపత్రికి తరలించారు అక్కడ ఉన్న పోలీస్ అధికారులు సిబ్బంది కలిసి క్షతగాత్రుని బోత్ ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించినట్లు తెలిసింది.






