28 April, 2026 | 7:57 PM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

28-04-2026 05:52 PM

దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని సాయన్నరావుపాలెం రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు అయిన ఘటన చోటుచేసుకుంది. దమ్మపేట మండలం, ముష్టిబండ గ్రామానికి చెందిన మానికల సత్యనారాయణ (38) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్రమైన గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు సమాచారం.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న దమ్మపేట 108 అంబులెన్స్ సిబ్బంది రాము, లాల్‌సింగ్‌లు గాయపడిన వ్యక్తిని ప్రథమ చికిత్స చేస్తూ దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.