పోచారంలో 'రాజు వెడ్స్ రాంబాయి ' సీన్ రిపీట్
14-03-2026 01:47 PM
పోచారంలో ‘రాంబాయి’ సినిమా తరహా ఘటన
హైదరాబాద్: నగరంలోని పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారణ ఘటన వెలుగులోకి వచ్చింది. యువకుడితో పాటు అతని తల్లిదండ్రులకు గతంలోనే ఎయిడ్స్ ఉంది. యువకుడు మనోహర్ తో యువతికి వివాహం నిశ్చయం అయింది. ఎయిడ్స్ ఉందని తేలడంతో యువతి పెళ్లికి నిరాకరించింది. ఈ నెల 11న యువతి ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలంటూ మనోహర్ ఒత్తిడి చేశాడు. పెళ్లికి నిరాకరించడంతో యుతతికి హెచ్ ఐవీ ఇంజెక్షన్ చేశాడు. యువతిని ఆస్పత్రికి తీసుకెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోచారం పోలీసులు నిందితుడు మనోహర్ ను అరెస్ట్ చేశారు.




