6 June, 2026 | 5:22 PM

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

06-06-2026 04:00 PM

కొల్లాపూర్ రూరల్: కొల్లాపూర్ పరిధిలోని సోమశిలకు వెళ్లే 167వ జాతీయ రహదారిపై ఓ హోటల్ సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న కొల్లాపూర్ ఎస్సై బండారి సురేష్ పరిశీలించి విచారణ చేపట్టారు. మృతుడు పెంట్లవెల్లి మండలం వేముకల్ గ్రామానికి చెందిన కృష్ణ గౌడ్ (47)గా గుర్తించారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, కృష్ణ గౌడ్‌ను ఎవరో కావాలనే హత్య చేసి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజాలు వెలికితీయాలని కోరారు.  మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.