హత్య.. ఆత్మహత్యనా
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని శ్యాం ఘడ్ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది. ముఖంపై గాయాలు ఉండడంతో.. ఎవరైనా హత్య చేశారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. వివరాల్లోకి వెళితే... శ్యామ్ ఘడ్ కోట వెనకాల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని గమనించిన స్థానికులు బుధవారం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
మహా రాష్ట్రలోని కిన్వట్ కు చెందిన పోలే గజానంద్ (36)గా గుర్తించారు. గత పది సంవత్సరాల నుండి నిర్మల్ లో ట్రాక్టర్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తూ.. జీనవం సాగిస్తున్నాడు. భార్య ఇతన్ని వదిలివేయడంతో ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈక్రమంలో శ్యామ్ ఘడ్ కోట వద్ద ముఖంపై గాయాలు, రక్తంతో ఉండడంతో ఎవరైన హత్య చేసి ఉంటారని పోలీసులు బావిస్తున్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు హత్య, అనుమానాస్పదం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ కృష్ణ తెలిపారు.




