13 March, 2026 | 12:25 PM

చెరువులో పడి వ్యక్తి మృతి

13-03-2026 12:10 AM

నాగిరెడ్డిపేట్, మార్చి 12 (విజయ క్రాంతి):చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన నాగిరెడ్డిపేట గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్త్స్ర భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం లింగంపేట్ మండలం లొంకలపల్లి గ్రామానికి చెందిన తొనిగండ్ల సంజీవులు సుమారు 35 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.వివాహం అనంతరం బతుకుదెరువు కోసం భార్యతో కలిసి ముంబై వెళ్లాడు.అక్కడ గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో అతని భార్య మృతి చెందింది.

అప్పటినుండి సంజీవులు మతిస్థిమితం కోల్పోయి తన తమ్ముడు సాయిలు వద్దనే ఉంటూ అప్పుడప్పుడు సైకిల్ పై శెట్పల్లి,సంగారెడ్డి,గోపాల్పేట్ గ్రామాల ప్రాంతాలలో తిరుగుతూ బిక్షాటన చేసేవాడు.నాగిరెడ్డిపేట గ్రామస్తులు పటేల్ చెరువు గట్టుపై సంజీవులు సైకిల్ ఉందని చెరువు నీటిలో ఒక మగ వ్యక్తి మృతి దేహం తేలినట్లు కనిపించిందని సమాచారం ఇవ్వగా అనుమానంతో అక్కడికి వెళ్లి చూడగా చెరువులో ఉన్న మృతి దేహం తన అన్న తొనిగండ్ల సంజీవులుదేనని గుర్తించారు.లంకలపల్లి గ్రామస్తుల సహాయంతో మృతి  దేహాన్ని బయటకు తీయడం జరిగింది.

సంజీవులు భార్య మరణించినప్పటి నుండి  మతిస్థిమితం సరిగాలేక సైక్పి తిరుగుతూ బిక్షాటన చేస్తేవాడు రెండు రోజుల క్రితం పటేల్ చెరువులో కాలకృత్యాలకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి చెరువుల్లో పడి ఈత రాక మృతి చెందినట్లు భావిస్తున్నామని అతని మరణంపై ఎలాంటి అనుమానం లేదని కుటుంబసభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు స్థానిక ఎస్త్స్ర భార్గవ్ గౌడ్ తెలిపారు.