22 March, 2026 | 2:19 PM

భక్తులతో పోటెత్తిన భద్రాద్రి రామాలయం

22-03-2026 12:59 PM

భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం శనివారం వేలాదిమంది భక్తులతో పోటెత్తింది. రంజాన్ సెలవు దినం వెంటనే ఆదివారం రావడంతో రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిమంది ప్రజలు గ్రామ దర్శనం కోసం వివిధ వాహనాల ద్వారా భద్రాచలం చేరుకోవడంతో భద్రాద్రి రామాలయం మొత్తం రామస్మరణతో మారుమోగింది. దీంతో ప్రధాన దేవాలయంలోని మూలవర్ల దర్శనం మూడు గంటలకు పైగా సమయం పట్టింది. శ్రీరామ నవ మి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవడంతో భక్తులు కల్యాణ రాముని దర్శించేందుకు భారీగా తరలివచ్చారు. దీంతో అధికారులు విస్తృత ఏర్పాటు చేశారు