23 June, 2026 | 10:10 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

03-02-2026 08:31 PM

కొల్చారం,(విజయక్రాంతి): అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటన మంగళవారం సాయంత్రం కొల్చారం మండలం పోతంశెట్టిపల్లిలో జరిగింది. మృతుని భార్య ఎల్లాపురం ప్రమీల తతన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎల్లాపురం వెంకటేశం (50) పులి పని చేస్తూ జీవించేవాడు. గత కొన్ని రోజులుగా దుర్వ్యసనాలకు తాగుడుకు బానిసైన వెంకటేశం పనికి వెళ్లకుండా మద్యం తాగుతూ ఉండడంతో అప్పుల పాలయ్యాడు.

దీంతో కొన్ని రోజుల క్రితం ఉపాధి నిమిత్తం సూరారం ప్రాంతానికి తన భార్య ప్రమీల తో కలిసి వెళ్ళాడు. గత నెల 25వ తేదీన సూరారం నుండి పోదంశెట్టిపల్లి వెళ్లి వస్తానని వచ్చిన వెంకటేశం గత వారం రోజులుగా గ్రామంలోని ఉన్నాడు. మంగళవారం సాయంత్రం సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరివేసుకొని మృతి చెందాడు. మృతుని భార్య ప్రమీల ఫిర్యాదు మేరకు కొల్చారం ఎస్ఐ మహ్మద్ మోహినుద్దీన్ కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం శవాన్ని మీద జిల్లా ఆసుపత్రికి తరలించారు.