23 June, 2026 | 11:21 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

యువతి అదృశ్యం

03-02-2026 08:27 PM

జవహర్ నగర్,(విజయక్రాంతి): ఇంటి నుంచి బయటకు వెళ్ళిన ఓ యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో పరిధిలో చోటుచేసుకుంది. ఎస్హెచ్వో సైదయ్య తెలిపిన కథన ప్రకారం... దమ్మాయిగూడలోని న్యూ ఇందిరానగర్ దండ్ల లక్ష్మి, భర్త ఎల్లేష్, కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్నారు. లక్ష్మి కుమార్తె శశిరేఖ(20) ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

ఈ నెల 2న ఇంటి నుంచి బయటకు వెళ్ళిన శశిరేఖ ఇంత వరకు తిరిగి రాలేదు. దీంతో ఆమె ఆచూకి కోసం చుట్టుప్రక్కల, బంధువుల వద్ద వెతికిన సమాచారం లభించలేదు. ఈ మేరకు కుటుంబసభ్యులు జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరో ఘటనలో ప్రైవేటు ఉద్యోగి అదృశ్యమయ్యాడు




జవహర్ నగర్ లోని మాజీ సర్వీస్మెన్ కాలనీలో రూత్ప్రియా భర్త మరియదాస్ కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్నారు. మరియదాస్ ప్రైవేటు కంపెనీలు విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. మరియదాస్(29) ఆగస్టు 2025లో ఇంట్లో చెప్పకుండ బయటకు వెళ్ళి ఇంత వరకు తిరిగి రాలేదు. దీంతో అతని ఆచూకి కోసం చుట్టుప్రక్కల, బంధువుల వద్ద వెతికిన సమాచారం లభించలేదు. రూత్ప్రియాతో ఫోన్లో మాట్లాడుతుండే వాడు. గత కొంతకాలంగా ఫోన్లో కూడా స్పందనలేకపోవడంతో రూత్రప్రియా అతనిపై అనుమానం వ్యక్తం చేస్తూ జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.