16 May, 2026 | 10:52 PM

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

16-05-2026 09:39 PM

పాపన్నపేట: జీవితంపై విరక్తిచెంది ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని పోడ్చన్ పల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వడ్ల సత్యనారాయణ(55) గత కొన్ని రోజులుగా ఫిట్స్, బ్యాక్ పెయిన్ తో బాధపడుతూ ఇంటి వద్దే ఉంటున్నాడు. పని చేయుటకు శరీరం సహకరించడంలేదని తరచూ ఇంట్లో బాధపడుతుండే వాడు. ప్రతి రోజులాగే శనివారం మధ్యాహ్నం సమయంలో భోజనం చేసి గదిలోకి వెళ్లాడు. జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాసేపటికి గమనించిన కుటుంబీకులు కొన ఊపిరితో ఉన్న అతన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించగా అక్కడ డాక్టర్లు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. మృతుడి భార్య నీరజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.