16 May, 2026 | 10:53 PM

కలోత్సవం విజేతలు వీరే...

16-05-2026 09:43 PM

మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి): విద్యా వారోత్సవాలలో భాగంగా శని వారం జడ్పీ బాలుర హై స్కూల్ లో నిర్వహించిన కలోత్సవాలలో వివిధ ఆయా విభాగాలలో ప్రతిభ కనబర్చినట్లు డీఈఓ యాదయ్య వెల్లడించారు. తోలుబొమ్మలాటలో అక్షయ్, జిల్లా పరిషత్ పాఠశాల ముత్యంపల్లి (ప్రథమ), ఒగ్గు కథలో జిల్లా పరిషత్ బాలిక లక్షేట్టిపేట (ప్రథమ), జిల్లా పరిషత్ పాఠశాల వెంకట్రావుపేట( ద్వితీయ), పేరిణి నృత్యంలో జిల్లా పరిషత్ బాలుర పాఠశాల మంచిర్యాల (ప్రథమ), జిల్లా పరిషత్ బాలికల పాఠశాల మంచిర్యాల(ద్వితీయ),  ఎంపీ యుపిఎస్ సెకండ్ జోన్ మందమర్రి (తృతీయ), కోలాటంలో ఎంపీపీ ఎస్ అక్కేపల్లి గూడ( ప్రథమ), పి ఎం శ్రీ జెడ్పిహెచ్ఎస్ తీగలు పహాడ్ (ద్వితీయ), ఎంపీ యుపిఎస్ టేకుమట్ల (తృతీయ),

లంబాడా నృత్యంలో టి జి ఎం ఎస్ మందమర్రి( ప్రధమ), ఎంపీపీ ఎస్ అక్క పెళ్లి గూడ (ద్వితీయ), సింగరేణి హై స్కూల్ మందమర్రి (తృతీయ), చిత్రలేఖనంలో జెడ్ పి ఎస్ ఎస్ దేవాపూర్(ప్రధమ), టీజీ మోడల్ స్కూల్ కాజిపేట్ (ద్వితీయ), పి ఎం శ్రీ జెడ్పిహెచ్ఎస్ తీగల్పహాడ్ (తృతీయ), జెడ్ పి హెచ్ ఎస్ దొనబండ (ప్రోత్సాహక), హస్త కళల్లో పిఎంశ్రీ  జెడ్పిహెచ్ఎస్ బజార్ ఏరియా బెల్లంపల్లి (ప్రథమ), పిఎంశ్రీ టిజిఎంఎస్ కోటపల్లి( ద్వితీయ), జెడ్పిహెచ్ఎస్ ముత్యం పెళ్లి (తృతీయ), దివ్యాంగుల విభాగంలో లంబాడి నృత్యంలో చైత్ర, భవిత సెంటర్ నస్పూర్ (ప్రథమ)లు విజయం సాధించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు ఎం భరత్ కుమార్, కే కృష్ణమూర్తి, జంబోజుసత్తయ్య, రాజకుమార్, అన్ని మండల విద్యాధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.