ఏసీబీకి చిక్కిన మామడ ఎస్సై
27-03-2026 01:39 AM
లంచం తీసుకుంటుండగా పట్టివేత
లక్ష్మణ్‌చందా, మార్చి 26 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా మామడ ఎస్సై తీగల అశోక్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. మామడ మండలానికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వివాదంలో ఫిర్యాదు వచ్చింది. మధ్యవర్తిత్తం ద్వారా సమస్య పరిష్కారం కోసం రూ.40 వేలు ఇవ్వాలని ఎస్సై డిమాండ్ చేయగా, 20 వేలకు ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని బాధితుడు ఏసీబీ అధికారులకు చెప్పగా, వారి సూచన మేరకు గురువారం లంచం ఇస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అయితే ఇక్కడ పనిచేసిన ఎస్సైలు సత్యనారాయణ, రాజు ఇదివరకే ఏసీబీకి చిక్కడం గమనార్హం.




