ఏపీలో 2800 మంది విద్యార్థులకు మలబార్ స్కాలర్ షిప్
విజయవాడ, మార్చి 26, 2026: ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద రిటైల్ ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ & డైమండ్స్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి 200 కోట్ల రూపాయల విలువైన CSR కార్యక్రమాలను ప్రకటించింది. తద్వారా భారతదేశం అంతటా సామాజిక కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిబద్ధతలో భాగంగా కంపెనీ తన ఆంధ్రప్రదేశ్ స్కాలర్షిప్ ప్రోగ్రాంను విజయవాడలో నిర్వహించింది, రాష్ట్రవ్యాప్తంగా 2,800 మంది విద్యార్థులకు మొత్తం 2.52 కోట్ల రూపాయల కేటాయింపుతో విద్యా సహాయాన్ని అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 33,000 మంది బాలికలకు స్కాలర్షిప్లను అందించడానికి 30 కోట్లు కేటాయించారు.
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, సిద్ధార్థ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. పద్మజ పాల్గొన్నారు. మలబార్ గోల్డ్ & డైమండ్స్ తరఫున శ్రీ సిరాజ్ P.K., హెడ్-రిటైల్ ఆపరేషన్స్ (రెస్ట్ ఆఫ్ ఇండియా) శ్రీ షరీజ్ కె, జోనల్ హెడ్-హైదరాబాద్, శ్రీ నిఖిల్ చంద్రన్, జోనల్ హెడ్-సెంట్రల్ ఆంధ్ర & రాయలసీమ, శ్రీ రాకేష్ కుమార్ కె, డిప్యూటీ హెడ్-మార్కెటింగ్ (ఎపి & టిఎస్) శ్రీ అర్జున్ ఎం, షోరూమ్ హెడ్, విజయవాడ మరియు శ్రీ నదీర్, డిప్యూటీ షోరూమ్ హెడ్, గుంటూరు తో పాటు స్థానిక కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయిలో ఈ స్కాలర్‌షిప్ చొరవ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 1,15,000 మందికి పైగా విద్యార్థినులకు మద్దతునందించింది. ఈ ఏడాది వివిధ రాష్ట్రాల్లో 33 వేల స్కాలర్‌షిప్‌లను పంపిణీ చేయాలని గ్రూప్ యోచిస్తోంది. మలబార్ గోల్డ్ డైమండ్స్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విస్తృతమైన సీఎస్‌ఆర్ ప్రణాళికలో భాగంగా 19 రాష్ట్రాల్లోని 3,000 కంటే ఎక్కువ ప్రాంతాల్లో 15 ప్రధాన కార్యక్రమాలను అమలు చేయనుంది. దీనివల్ల 2 లక్షల మందికి పైగా ప్రజలు ప్రయోజనం పొందుతారని అంచనా. విద్య అనేది వ్యక్తుల, సమాజాల దీర్ఘకాలిక భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తిని కలిగి ఉంటుందనీ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిభ ఉండి కూడా చదువు కొనసాగించడానికి ఆర్థిక సహాయం అవసరమైన విద్యార్థులకు అండగా నిలవడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మలబార్ గ్రూప్ ఛైర్మన్ ఎం.పి.అహమ్మద్ పేర్కొన్నారు.




