30 June, 2026 | 3:58 AM

మకుటం మంచి అనుభూతి పంచే చిత్రం

30-06-2026 01:13 AM

విశాల్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘మకుటం’. సూపర్ గుడ్ ఫిలమ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ మూవీలోని ‘నచ్చాకే వచ్చేరా’ పాటను విడుదల చేశారు.

ఈ వేడుకలో విశాల్ మాట్లాడుతూ.. “ఈ సినిమాతో ఓ మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తా. ‘నచ్చాకే వచ్చేరా’ పాటను ప్రభ బోనగిరి అద్భుతంగా పాడింది” అన్నారు. అంజలి మాట్లాడుతూ.. “విశాల్‌కు ‘మకుటం’తో హీరోగా, దర్శకుడిగా పెద్ద విజయం దక్కాలి” అని చెప్పారు. ‘నేను ప్రైవేట్ ఆల్బమ్స్‌కు పాటలు పాడుతుంటా. తొలిసారి సినిమాకు పాడటం ఆనందంగా ఉంద’ని సింగర్ ప్రభ బోనగిరి తెలిపారు. ఈ కార్యక్రమంలో మూవీటీమ్ అంతా మాట్లాడారు.