కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి తేవడం అభినందనీయం
28-04-2026 01:45 AM
మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు
కోదాడ, ఏప్రిల్ 27: కోదాడ ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటు లోకి తేవడం అభినందనీయం అని మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని పశువుల సంత బజారులో నూతనంగా నిర్మించిన ధరణి హాస్పిటల్ను ఆమె ప్రారంభించి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కారింగుల ఉమా అంజన్ గౌడ్, నిర్వాహకులు డాక్టర్ కరుణ, గుజ్జల సాత్విక్ రెడ్డి, కార్తీక్ రెడ్డి, ప్రముఖ వైద్యులు జాస్తి సుబ్బారావు, ఏటుకూరి రామారావు,బద్దం కృష్ణారెడ్డి పార్ధు ,ప్రసాద్, కొత్తమాసు జనార్ధన్, బొల్లి రాంబాబు, సురేష్ అనుతిష్య డాక్టర్ శ్రీనివాస్, తూమాటి వరప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.






