28 April, 2026 | 7:51 AM

గాయపడిన బీఆర్‌ఎస్ యూత్ అధ్యక్షుడికి జనగామ ఎమ్మెల్యే ఆర్థిక సహాయం

28-04-2026 01:43 AM

ఘట్‌కేసర్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ 8 పరిధి రాజీవ్ గృహకల్పలో నివాసముంటున్న పోచారం మున్సిపల్ భారత్ రాష్ట్ర సమితి పార్టీ యూత్ అధ్యక్షులు, ఉద్యమ కారుడు కొమ్ముల ప్రశాంత్ కి రోడ్డు ప్రమాదం జరిగి గాయాలు అయిన విషయం తెలుసుకొని  సోమవారం ఫోన్ లో మాట్లాడి పరామర్శించి చికిత్స నిమిత్తం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి రూ. 50వేలు ఆర్థిక సాయం అందజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర గిరిజన  నాయకులు జితేందర్ నాయక్, నాయకులు కె.ఎం. రెడ్డి, పాశం లక్ష్మణ్ యాదవ్, రత్లవత్ సంతోష్ నాయక్, ఉసికె రాఘవేందర్ రెడ్డి, విశ్లావత్   తిలక్ నాయక్, పావులూరి లోకేష్ రెడ్డి, గాంధారి నవీన్, మహేందర్ నాయక్, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.