26 May, 2026 | 1:04 PM

Breaking News

గాంధీ ఆస్పత్రి నుంచి ఖైదీ పరార్   •   సుల్తానాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యేదే   •   పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన   •   డంప్ యార్డ్ ఏర్పాటుకు ఒప్పుకోం..!   •   తాళం వేసిన ఇంట్లో చోరీ   •   మళ్లీ సీఎం కుర్చీ పంచాయతీ.. ఢిల్లీకి సిద్ధూ, డీకే.. పర్యటనపై ఉత్కంఠ   •   రోడ్డుప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి.. ఎస్పీ నితికా పంత్ నివాళి   •   ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు   •   పాలమూరు ప్రాజెక్టు పూర్తికి.. అవాంతరాలు అధిగమిస్తాం: మంత్రి జూపల్లి   •   డ్రైవర్ నిద్రమత్తు.. పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు బోల్తా   •  

తెలంగాణ బంద్ విజయవంతం చేయండి

11-10-2025 05:10 PM

నిర్మల్ (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో బీసీల ఐక్యత కోసం 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ బీసీ సంఘం ఆధ్వర్యంలో 14న బంద్ నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం నేతలు తెలిపారు. శనివారం నిర్మల్ ప్రెస్ క్లబ్ లో సంఘ నాయకులు పున్నం నారాయణ గౌడ్ అనుముల భాస్కర్ కిరణ్ కుమార్ గజేంద్ర యాదవ్ మాట్లాడుతూ ఈ బంద్ లో తెలంగాణలోని బీసీ కులాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు బీసీ సంఘాల పోరాటం ఆగదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు పాల్గొన్నారు.